INS Nistar Commissioned in Visakhapatnam | ఇండియన్ నేవీ లోకి INS నిస్తార్ | ABP Desam

ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా భారత ప్రభుత్వం మరో యుద్ధ నౌకను జాతికి అంకితం చేయనుంది. అదే INS నిస్తార్‌. విశాఖపట్నంలో INS నిస్తార్‌ నౌకను ప్రారంభించనున్నారు. INS నిస్తార్‌ మొట్టమొదటి స్వదేశీ రూపకల్పన తో చేసిన డైవింగ్ సపోర్ట్ వెసెల్. విశాఖపట్నంలోని హిందుస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ ఈ యుద్ధ నౌక ను నిర్మించింది. అంతర్జాతీయ ప్రమాణాలకు ఏ మాత్రం తగ్గకుండా అధునాతన టెక్నాలజీతో నిర్మించారు. 

ఈ యుద్ధ నౌకను నిర్మించడానికి 80 శాతం కంటే ఇండీజీనియస్ కంటెంట్ ని వాడారు. INS నిస్తార్‌ నిర్మాణానికి దాదాపు 120 MSMEలు సహకారం అందించాయి. 10,500 టన్నుల కంటే ఎక్కువ బరువు ఉండే INS నిస్తార్‌ దాదాపు 120 మీటర్ల పొడవు, 20 మీటర్ల కంటే ఎక్కువ వెడల్పు ఉంటుంది. సముద్రం లోతులో డైవింగ్ కార్యకలాపాలను నిర్వహించడం, రెస్క్యూ ఆపరేషన్స్ వంటి పరిస్థితుల్లో INS నిస్తార్ అద్భుతంగా పనిచేస్తుంది. ఈ నౌకలో అత్యాధునిక రిమోట్లీ ఆపరేటెడ్ వెహికల్స్ అమర్చబడి ఉన్నాయి. ఇండియన్ నేవీ ఈస్ట్రన్ నౌకాదళంలో చేరనున్న నిస్తార్, భారతదేశ భద్రత, రెస్క్యూ సామర్థ్యాలను బలోపేతం చేయడంలో  కీలక పాత్ర పోషిస్తుంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola