తమిళనాడు మాజీ జడ్జి చెప్పినవన్నీ అక్షర సత్యాలు..అందుకే చంద్రబాబు కౌంటర్
గుంటూరు జిల్లాలో హోంమంత్రి సుచరితతో కలిసి పర్యటించిన మంత్రి కన్నబాబు....ప్రతిపక్షనేత చంద్రబాబు పై వ్యాఖ్యలు చేశారు.సీఎం జగన్ పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన మంత్రి....తమిళనాడు మాజీ జడ్జి ఏపీలో మాట్లాడిన మాటలు అక్షర సత్యాలన్నారు. కేసీఆర్ కి భయపడి పదేళ్ల రాజధానిని వదిలేసి వచ్చిన చంద్రబాబు....భూములు రేట్లు పెరగాలనే తన వాళ్ల రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసం అమరావతిలో రాజధానిని పెట్టారని విమర్శించారు. భూములు రేట్లు పెరిగినంత మాత్రాన అభివృద్ధి జరిగినట్లు కాదన్నారు.