Kandula Durgesh Taking Charge As Minister | మంత్రిగా బాధ్యతలు తీసుకున్న కందుల దుర్గేష్ | ABP Desam

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిగా కందుల దుర్గేష్ ఈ రోజు సాయంత్రం సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. రూ.2.31 కోట్లతో 10 టూరిజం బోట్ల కొనుగోలుకి సంబంధించిన ఫైల్ మీద ఆయన తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అభినందనలు తెలిపారు. జనసేన ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, టీడీపీ నేతలు హాజరై అభినందలు అందించారు. అంతకు ముందు కందుల దుర్గేష్ మెగాస్టార్ చిరంజీవిని క‌లిశారు. ‘విశ్వంభ‌ర’ సెట్స్ లో చిరుతో క‌లిసి కొన్ని విష‌యాలపై చ‌ర్చించారు. ఆ విష‌యాన్ని చిరంజీవి స్వ‌యంగా సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించారు. కందుల దుర్గేష్ ని క‌ల‌వ‌డం ఆనందంగా ఉంది అంటూ ఆయ‌న ఇన్ స్టాలో వీడియో పోస్ట్ చేశారు. అయితే, గతంలో చిరంజీవి టాలీవుడ్ సమస్యలను విన్నవించేందుకు తోటి హీరోలు, దర్శక నిర్మాతలతో కలిసి అప్పటి ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు. ఇప్పుడు ఏపీలో ప్రభుత్వం మారడంతో.. స్వయంగా మంత్రే చిరంజీవిని కలిసి టాలీవుడ్ సమస్యలను తీరుస్తామని హామీ ఇవ్వడంపై చిరు ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola