ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా కాకినాడలో కేవీ విద్యార్థుల భారీ ర్యాలీ
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా కాకినాడ గ్రామీణం మండలం వలసపాకల గ్రామంలోని కేంద్రీయ విద్యాలయం విద్యార్థులు.... 75 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. గ్రామవీధుల్లో మేరా భారత్ మహాన్ అంటూ నినాదాలు చేశారు.