కాకినాడ జిల్లా వలసపాకల కేంద్రీయ విద్యాలయలో 30 మంది పిల్లలకు తీవ్ర అస్వస్థత, హాస్పిటల్ లో చికిత్స
కాకినాడ జిల్లా వలసపాకల పంచాయతీ వద్ద ఉన్న కేంద్రీయ విద్యాలయంలో సుమారు 30 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఐదు, ఆరు తరగతుల విద్యార్థులకు ఒక్కసారిగా ఊపిరి ఆడక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారందర్నీ వలసపాకలలోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. పోలీసులు, అధికారులు స్కూల్ వద్దకు చేరుకుని కారణాలను ఏం జరిగిందో పరిశీలిస్తున్నారు.