ఖాజీపేట లో వసతి గృహాల నుండి విద్యార్థునులు ఇంటికి..
కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన ఆదర్శ పాఠశాలలు ఆలనా పాలనా లేక అగమ్యగోచరంగా తయారవుతున్నాయి. ఆదర్శ పాఠశాలలకు అనుబంధంగా ఉన్న వసతి గృహాల నుండి విద్యార్థునులు ఇంటికి పయనం అవుతున్నారు. గత కొంత కాలంగా వసతి గృహాలకు నిత్యావసర సరుకులు అందించే కాంట్రాక్టర్ కు ప్రభుత్వం బిల్లులు చెల్లించని కారణంగా అతను వసతి గృహాలకు నిత్యావసర సరుకులు నిలిపివేశాడు.దీంతో 80 మంది తో నడుస్తున్న కడప జిల్లా , ఖాజీపేట ఆదర్శ పాఠశాల విద్యార్థినులు తిండిలేక ఇంటికి పయనం అవుతున్నారు. దీంతో ఇక్కడ ఉంటూ చదువుకుంటున్న 80 మంది విద్యార్థునుల చదువులు ప్రశ్నార్థకంగా తయారయ్యాయి.