ఎర్రచందనం తరలిస్తూ పోలీసులకు చిక్కిన కేటుగాళ్లు..!| ABP Desam
Continues below advertisement
కడపజిల్లా సిద్దవటం మండలం మాచుపల్లి వద్ద ఎర్రచందనం అక్రమంగా తరలిస్తున్న 5 మంది స్మగ్లర్ల ను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 2 కార్లు , 16 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణా పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని అందులో భాగంగా జిల్లాలో పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు.అంతరాష్ట్ర స్మగ్లర్లను పట్టుకోవడానికి ప్రత్యేక పోలీస్ టీమ్ లు ఏర్పాటు చేశామన్నారు.ఎవరైనా ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.
Continues below advertisement