Polavaram: పరిహారం కోసం నిరాహార దీక్ష చేపట్టిన పోలవరం నిర్వాసితులు..! | ABP Desam
పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో నిర్వాసితులు ఆందోళనబాట పట్టారు. గిరిజనేతరులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ చెల్లించాలంటూ నిరవధిక రిలే నిరాహార దీక్ష చేపట్టారు. గోదావరి వరద పేరుతో గ్రామాలను ఖాళీ చేయించి, నష్టపరిహారం ఇవ్వలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తమకు రావాల్సిన నష్టపరిహారం ఇచ్చేస్తే గ్రామాలు ఖాళీ చేస్తామంటున్నారు.