JC Prabhakar Reddy Protest For Mirchi Farmers: మిర్చి పంట ఎండిపోతోందని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళన
JC Prabhakar Reddy Protest For Mirchi Farmers :
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పెద్దవడుగూరు మండలంలో మిర్చి రైతులతో కలిసి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళనకు దిగారు. దీని వల్ల జాతీయ రహదారిపై ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రస్తుతం మిర్చి పంటలకు నీరు ఎలాగూ రాదని, కనీసం పంటలను పరిశీలించి పరిహారాన్నైనా అందించాలని జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.