JC Prabhakar Reddy Protest At Tadipatri: మున్సిపల్ ఆఫీస్ ఆవరణలోనే జేసీ నిద్ర
అనంతపురం జిల్లా తాడిపత్రిలో అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. డివైడర్ పై పడుకుని నిరసన తెలియచేస్తున్న మున్సిపల్ ఛైర్మన్, టీడీపీ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డిని ఎత్తుకెళ్లి పోలీసులు ఇంట్లో ఉంచారు. ఈ సమయంలో పోలీసులకు, జేసీ అనుచరుల మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంలో జేసీ సొమ్మసిల్లి పడిపోయారు.