JC Prabhakar Reddy House Arrest: తాడిపత్రిలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత
అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ ఛైర్మన్, టీడీపీ సీనియర్ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇసుక అక్రమ రవాణాలపై మండిపడుతున్న జేసీ.... వాహనాలను తగలబెడతానంటూ గతంలోనే డెడ్ లైన్ ఇచ్చారు. అది ఇవాళ్టితో ముగియటంతో జేసీని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. జేసీ నివాసం వద్ద హైటెన్షన్ నెలకొంది. జేసీని పోలీసులు బలవంతంగా తీసుకెళ్తుండగా.... ఆయన సొమ్మసిల్లి పడిపోయారు.