Janasena vs YSRCP Politics: రూటు మార్చిన జనసేన, వైసీపీకి కౌంటర్ అటాక్
ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ గొడవ ఎప్పుడూ ఉండేదే. కొత్తగా ఇప్పుడు వైసీపీ.... జనసేనను బాగా టార్గెట్ చేస్తోంది. పవన్ కల్యాణ్ వారానికి ఒకసారి బయటకు వచ్చి విమర్శలు చేసినా వైసీపీ తట్టుకోలేకపోతోంది. పేర్ని నాని, రోజా ఇలా అందరూ విరుచుకుపడిపోతున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఈసారి జనసేన నాయకులు కూడా అంతకుమించి అంటున్నారు. పేర్ని నాని, రోజాపై ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. రెండురోజులుగా జనసేన రియాక్షన్లు కూడా ఘాటుగా ఉన్నాయి.