Janasena: రోడ్లపై మూకుమ్మడి పొర్లు దండాలు.. ఏకంగా బురద నీటిలోనే..
చిత్తూరు జిల్లా పాలసముద్రంలో జనసేన నేతలు విన్నూత్న రీతిలో తమ నిరసనను తెలియచేశారు. మండలంలో రహదారులను బాగుచేయనందుకు ఆగ్రహించిన జనసేన నాయకులు రోడ్లపై పొర్లుదండాలు పెట్టారు. ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి నియోజకవర్గంలోనే ఇలాంటి పరిస్థితి నెలకొందని జనసేన కార్యకర్తలు.. రోడ్లను బాగు చేసి తమ కష్టాలను తీర్చండని డిమాండ్ చేశారు.