ఆందోళన వలన ప్రజలకు ఇబ్బంది కలిగితే ప్రభుత్వానిదే బాద్యత.
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం చాలా సింపుల్ గా పరిష్కరించే అవకాశాలు ఉన్నాయి..కేవలం పీఆర్సీ,సీపీఎస్ మాత్రమే కాదు చాలా సమస్యలు దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్నాయి..వాటిని పరిష్కరించాలని జేఎసి అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు అంటున్నారు.ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని ,ఇప్పటికే మూడు సంవత్సరాలుగా ప్రభుత్వానికి పూర్తిగా సహకారాన్ని అందించాం కాబట్టి ఇక పై ఆందోళన ఉదృతం చేసి తీరుతామని స్పష్టం చేస్తున్నారు.కార్యాచరణలో భాగంగా ఉద్యోగుల ప్రాంతీయ సదస్సులు కొనసాగిస్తామని వెల్లడించారు.