ఫ్యాక్టరీ రసాయనాల వల్ల చాలా ఇబ్బందిగా వుందంటున్న హిందూపురం వాసులు.
అనంతపురం జిల్లా హిందూపురం, తూముకుంట పారిశ్రామికవాడలో రసాయన ఫ్యాక్టరీలలో కలుషిత నీరు ,నివాసం ఉంటున్న ఇళ్ల ఆవరణంలో కి వచ్చి దుర్వాసన వెదజల్లుతూ ఉన్నాయని కనీసం జీవనం సాగించే పరిస్థితి లేదని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు స్థానికులు. పరిశ్రమలోని వ్యర్థాలను రీసైక్లింగ్ చేయకుండా బయటకు వదలటం వల్ల చుట్టుపక్కల బోర్లలో నీరు కలుషితం అవుతున్నాయని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.