Huge Rains: వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు- పంటనష్టం
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం తో గత మూడురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా శ్రీకాకుళం జిల్లా రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారు. అకాలవర్షాలు అన్నదాతకు కష్టాలు తెచ్చాయి. పంట చేతికొచ్చిన సమయంలో ఇలాంటి వైపరీత్యాలు రావటం తమకు ఎంతో నష్టాన్ని.. కష్టాలను తెచ్చిపెడుతోందని శ్రీకాకుళం జిల్లా రైతులు ఆవేదన చెందుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కావటంతో వేలాది ఎకరాల్లో పంట నీటమునిగాయి. చేతికి వొచ్చిన పంట కళ్ళముందే తడిసి ముద్ద కావటంతో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.