Hanuman Jayanti Celebrations in Nettikanti Temple | నెట్టికంటలో ఘనంగా హనుమాన్ జయంతి

అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయాల్లో హనుమాన్ జయంతి ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రత్యేక అలంకరణలతో దేవాలయాల్ని ముస్తాబు చేసి హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జయంతి వేడుకల్లో భాగంగ స్వామివారికి నేడు తులసిమాల సేవ, పుష్పాలంకరణ, పండుతో అలంకరణ తో పాటు స్వామి వారికి వజ్ర కవచ అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామి వారి దర్శనం కోసం కసాపురంకు భారీ సంఖ్యలో క్యూ కట్టారు. ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అయితే భక్తుల రద్దీ తీవ్రంగా ఉండడంతో ఆలయ అధికారులు.... భక్తులు ఏ ఇబ్బందులు పడకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అనంతరం సాయంకాలం స్వామి వారిని ఒంటె పై ప్రాకారోత్సవం చేయడంతో హనుమాన్ జయంతి వేడుకలు ముగియనున్నాయి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola