Guntur Chilli Record rates : ఆనందంలో మిర్చి రైతులు | ABP Desam
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మిర్చి ధర పెరగడంతో రైతులు అనందానికి అవధులు లేవు. ఏటా మిర్చి పంట దిగుబడికి ముందు ధర అధికంగా ఉంటుంది.. పంట రైతు చేతికి వచ్చి మిర్చి టిక్కీలు యార్డ్ లో అమ్మకానికి వచ్చిన తర్వాత ఒక్క సారిగా ధర పడి పోవడంతో రైతు నష్ట పోయేవారు. కానీ ఈ సారి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. పంట చేతికి వచ్చిన దగ్గరి నుంచి ఇప్పటి వరకూ ధర పెరిగిందే కానీ తగ్గక పోవడంతో మిర్చి రైతులు ఖుషీ అవుతున్నారు.