MLC Candidate GV Sunder Interview | మూడు నినాదాలతో గ్రాడ్యుయేట్ MLC బరిలో ఉన్నా | ABP Desam

ఎడ్యుకేషన్‌, ఎంప్లాయ్‌మెంట్‌, జామ్‌ సెక్యూరిటీ ఇవే తన నినాదమని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ తనయుడు, ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ స్వతంత్య్ర అభ్యర్ధి జీవీ సుందర్‌ అన్నారు. ఇంతవరకు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వారు కౌన్సిల్‌లో సమర్ధవంతంగా ప్రభుత్వం ముందు సమస్యలు పెట్టలేదని, అయితే తనకున్న ఓ ఆలోచనతో మూడు నినాదాలతో ముందుకు వెళ్తున్నానన్నారు. ప్రస్తుతం ఉన్న అభ్యర్థుల్లో ఎవ్వరికీ ఓ విధానం అంటూ లేదని అన్నారు. కనీసం మ్యానిఫెస్టో కూడా ఎవ్వరూ రూపొందించలేదన్నారు. హర్షకుమార్‌ తనయునిగా కొంత వరకు అడ్వాంటేజ్‌ ఉంటుందని, అయితే సెన్సిబుల్‌గా మాట్లాడే విధానమే తనకు గుర్తింపు వస్తుందందన్నారు. మ్యానిఫెస్టో వైసీపీ రంగులను పోలిఉండడాన్ని ప్రశ్నిస్తే తనకు ఇష్టమైన బహుజన, శాంతి, కార్మిక కర్షక రంగానికి చెందినవిగా రూపకల్పన చేశామన్నారు. తాను ఎమ్మెల్సీ అభ్యర్ధిని గనుక అన్నివర్గాల వద్దకు వెళ్లి ఓటు అడుగుతానన్నారు.. జీవీ సుందర్‌ ఇంకా ఏం చెప్పారో ఏబీపీ దేశం ఫేస్‌ టూ ఫేస్‌లో తెలుసుకుందాం..

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola