Govt School Principal Slaps Himself: చేసిన తప్పును నిలదీసేసరికి లెంపలేసుకున్నారు.!
కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం సీతానగరం ప్రభుత్వ పాఠశాలలోని ప్రధానోపాధ్యాయుడు తనను తానే చెప్పు పెట్టి కొట్టుకున్నారు. విషయం ఏంటంటే.... అదే పాఠశాలలో చదివే పిల్లల చేత తన ఇంటి పనులు చేయించుకుంటున్నట్టు తల్లిదండ్రులకు తెలిసింది. ఆగ్రహంతో వెళ్లి వారు నిలదీశారు. దాదాపు కొట్టినంత పనిచేశారు. తన తప్పు తెలుసుకున్న ప్రిన్సిపల్..... తన చెప్పుతో తానే లెంపలేసుకున్నారు. ప్రిన్సిపల్ పై తల్లిదండ్రులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.