Goosebumps Celebrations in Hindupur Town: ఈ వీడియో చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది..!| ABP Desam
Anantapur జిల్లా Hindupur లో నివాసముంటున్న తమిళులు... తమ ఆరాధ్యదైవమైన సుబ్రహ్మణ్యస్వామి కోసం ఒళ్లు గగుర్పొడిచేలా విన్యాసాలు చేశారు. ఏటా తంగుని నక్షత్రం రోజున జరుపుకునే సుబ్రహ్మణ్య స్వామి రథోత్సవాన్ని హిందూపురంలో నిర్వహించారు. తాము కోరుకున్న కోరికలు నెరవేరినందుకు మొక్కు చెల్లించుకున్నట్టుగా చాలా మంది ఒంటికి చూలాలు గుచ్చుకుని రథోత్సవంలో పాల్గొన్నారు. హరోంహర అనే నినాదాలతో పట్టణవీధులు మారుమోగాయి. తమిళుల ఆచారాన్ని స్థానికులు ఆసక్తిగా తిలకించారు. కొంతమంది Dasavatharam లో Kamal Hasan ను గుర్తు చేసుకున్నారు.