Nellore News: గుప్త నిధుల పేరుతో భారీ మోసం... చివరికి దారుణం
నెల్లూరులో గుప్తనిధుల వెతుకులాటలో జరిగిన లావదేవీల్లో ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడు . హత్యకు గురైన వ్యక్తి పొదలకూరుకి చెందిన షేక్ రఫీ. గుప్తనిధుల పేరుతో చాలా కాలంగా కొంతమంది స్థానికులని నమ్మించేవాడు. అతను దర్గాలో తాయత్తులు తయారుచేసేవాడు. అతని మాటతీరు చూసి చాలా మంది అతన్ని నమ్మారు. దాని కోసం చాలా మంది భారీగా ఖర్చు చేశారు. చివరకి రఫీ మోసం చేశాడని, తాము మోసపోయామని గుర్తించిన బాధితులు అందరూ కలిసి అతన్ని హతమర్చారు .