Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు

Continues below advertisement

సాగరతీరం విశాఖపట్నంలో ఫార్ములా-1 (F1) రేసింగ్ కారు సందడి చేస్తోంది. ఆంధ్రా యూనివర్శిటీ (AU) ఇంజినీరింగ్ కళాశాల బాస్కెట్‌బాల్ కోర్ట్ ప్రాంగణంలో ఆరాకిల్ రెడ్ బుల్ రేసింగ్ (Oracle Red Bull Racing) F1 కారు ప్రదర్శనను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఈ కారును అందుబాటులోకి తీసుకురావడంతో విద్యార్థులు, ఆటోమొబైల్ ప్రేమికులు మరియు రేసింగ్ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి కారును ఆసక్తిగా తిలకించారు. యువతలో మోటార్ స్పోర్ట్స్ పట్ల ప్రోత్సాహాన్ని పెంచడంతో పాటు, అడ్వాన్స్డ్ ఇంజినీరింగ్ సాంకేతిక నైపుణ్యాలను విద్యార్థులకు క్షేత్రస్థాయిలో చేరువ చేసేందుకు ఈ కార్యక్రమం దోహదపడింది. ట్రిపుల్ ఆర్ మోటార్ స్పోర్ట్స్ ప్రతినిధులు మరియు ఏయూ ఇంజినీరింగ్ విద్యార్థులు ఈ ప్రదర్శనలో అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ రేసింగ్ కార్ హై-స్పీడ్ డిజైన్, ఏరోడైనమిక్స్, డౌన్‌ఫోర్స్ మరియు ఇంజిన్ పనితీరుకు సంబంధించిన సాంకేతిక విశేషాలను నిర్వాహకులు విద్యార్థులకు క్లియర్‌గా వివరించారు. విద్యార్థులు కారుతో ఫొటోలు, సెల్ఫీలు దిగుతూ సందడి చేసిన ఈ రెడ్ బుల్ రేసింగ్ కార్ టూర్ విజువల్స్ మరియు పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola