JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
అధికారంలోకి వస్తే ఉద్యోగులను కడుపులో పెట్టుకుని చూసుకుంటామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం, తీరా అధికారంలోకి వచ్చాక కనీసం ఇవ్వాల్సిన డీఏ (DA) బకాయిలను కూడా విడుదల చేయడంలేదని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న మొత్తం రాబడిలో అత్యధిక భాగం ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకే వెళ్తోందంటూ కొందరు చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, తమ న్యాయమైన హక్కుల సాధన కోసం రాబోయే రోజుల్లో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాల ప్రకారం ఉద్యోగుల పెండింగ్ డీఏలు, సీపీఎస్ రద్దు, ఇతర ఆర్థిక ప్రయోజనాలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్. రాష్ట్ర బడ్జెట్ మరియు వస్తున్న రాబడిలో ఉద్యోగుల జీతాలకే అత్యధిక వాటా పోతోందన్న ప్రచారంలో నిజం లేదని, గణాంకాలతో సహా స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేయాలనీ కోరుతున్నారు.