Flood Situation In Polavaram: ముంపు గ్రామాల ప్రజలను కాపాడిన రెస్క్యూ సిబ్బంది
పోలవరంలో గోదావరి ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రభావిత గ్రామాల్లో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరద ప్రభావిత గ్రామాల్లోని ప్రజలను నాలుగు బోట్ల ద్వారా NDRF, SDRF బృందాలు కాపాడాయి. అలాగే అనేక ముంపు గ్రామాల్లో పర్యటించిన రెవెన్యూ అధికారులు, రెస్క్యూ బృందాలు...... ఆయా గ్రామస్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లోనివారిని, కుక్కనూరు, వేలేరుపాడు గ్రామస్థులను ఇళ్లు ఖాళీ చేయాలని, తమతో సహకరించాలని అధికారులు కోరారు. సమీప పునరావాస కేంద్రాలకు వెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నారు.