Fire Accident In Nellore Collectorate: కలెక్టరేట్ ప్రాంగణంలో అగ్నిప్రమాదం
నెల్లూరు కలెక్టరేట్ ప్రాంగణంలో అగ్నిప్రమాదం జరిగింది. గోడౌన్ లో అగ్నిప్రమాదం జరగటంతో అధికారులు అప్రమత్తమై వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని..... మంటలను ఆర్పేశారు. అయితే ఆలోగానే అక్కడే ఉన్న ఎన్నికల సామగ్రి కాలి బూడిదైంది.