Farmers Protest: ఎమ్మెల్యే సోదరుడి భూమికి సంబంధించిన సర్వేపై రైతుల ఆందోళన | ABP Desam

Anantapur జిల్లా D Harehal మండలం Muridi గ్రామంలో దారి విషయంలో రైతులు ఆందోళనకు దిగారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సోదరుడు కొండా రెడ్డి పొలానికి దారి విషయమై రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టారు. దీన్ని స్థానిక రైతులు అడ్డుకుని అధికారులతో వాగ్వాదానికి దిగారు. దారి లేకపోయినా ఉందంటూ సర్వే చేస్తున్నారని ఆరోపించారు. సర్వే కొనసాగిస్తే పురుగులమందు తాగుతామంటూ పురుగులమందు డబ్బాలతో ఆందోళన చేశారు. పోలీసులు వాటిని లాక్కోవటంతో సర్వేకు అడ్డంగా అక్కడే కూర్చుని రైతులు ఆందోళన కొనసాగించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola