Dollar Seshadri: అశ్రునయనాల మధ్య తిరుపతిలో డాలర్ శేషాద్రి అంత్యక్రియలు

గుండెపోటుతో హఠాన్మరణం చెందిన తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి అంత్యక్రియల అశ్రునయనాల మధ్య ప్రారంభమయ్యాయి. తొలుత శేషాద్రి పార్థివదేహాన్ని సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. డాలర్ భౌతికకాయాన్ని దర్శించుకుని నివాళులు అర్పించారు. అనంతరం అంతిమ యాత్ర ప్రారంభం కాగా...తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి...శేషాద్రి పాడె మోసి కడసారి వీడ్కోలు పలికారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola