Dokka Seethamma Home Tour | ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ ఇల్లు ఇప్పుడేలా ఉంది..?| ABP Desam

Dokka Seethamma Home Tour  | ఆంధ్రుల అన్నపూర్ణగా పేరొందిన డొక్కా సీతమ్మ ఇల్లు ఇప్పుడు ఎలా ఉందో చూస్తారా..? ఆ కాలంలో ఆమె వంట వండటానికి ఉపయోగించిన పాత్రలు.. నాటి చరిత్రకు ఎన్నో ఆనవాళ్లు ఇక్కడ ఉన్నాయి. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ హోమ్ టూర్ లో తెలుసుకోండి.

ఆంధ్రుల అన్నపూర్ణగా పిలుచుకునే డొక్కా సీతమ్మ పేరుమీద ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నభోజన పథకానికి రాష్ట్ర ప్రభుత్వం డొక్కా సీతమ్మ మధ్యాహ్నభోజన పథకంగా మార్పు చేయడం పట్లా ముఖ్యంగా డెల్టా ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.. ధవళేశ్వరం బ్యారేజ్‌ నిర్మాణానికి ముందు డెల్టా ప్రాంతం అంతా కరవు కాటకాలతో అల్లాడి పోతున్న సమయంలో జమిందారు వంశంలోకి కోడలుగా వచ్చిన సీతమ్మ ముందు నుంచి అన్నదానం చేస్తూ అన్నపూర్ణగా అందరి మనసులు దోచుకున్నారు. కులమతాలకు అతీతంగా తన వద్దకు ఆకలి అని వచ్చిన ప్రతీ వారికి భోజనం వండి పెట్టి వారి ఆకలి తీర్చిన అమ్మగా సీతమ్మను కొలుస్తారు.

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola