మంగళగిరి ఆరో బెటాలియన్ ఫైరింగ్ రేంజ్ లో డీజీపీ ఆయుధాల పరిశీలన
మంగళగిరి ఆరో బెటాలియన్ లో డీజీపీ గౌతం సవాంగ్ పర్యటించారు. ఫైరింగ్ రేంజ్ ని పరిశీలించిన డీజీపీ అక్కడ ఏర్పాటు చేసిన అధునాతన ఆయుధాలను పరిశీలించారు. స్వయంగా ఫైరింగ్ చేసి ఆయుధాల పనితీరును సరిచూశారు. కొత్త టెక్నాలజీతో డెవలప్ చేయించిన ఆయుధాలపై పోలీస్ అధికారులకు డీజీపీ సవాంగ్ పలు సూచనలు చేశారు.