Surya Prabha Vahanam: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు.| ABP Desam
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన సోమవారం ఉదయం అమ్మవారు సూర్య ప్రభ వాహనంపై కనువిందు చేశారు. ఆలయం వద్దగల వాహన మండపంలో ఉదయం 8 నుండి 9 గంటల వరకు అమ్మవారి వాహనసేవ ఏకాంతంగా జరిగింది.శ్రీవారి హృదయపీఠంపై నిలిచి లోకాన్ని కటాక్షిస్తున్న కరుణాంతరంగ అలమేలుమంగ. ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు. లోకాలనే నిద్ర లేపి,నూతన శక్తి ని ప్రసాదించే సూర్యుడి పై అధిరోహుడై సిరితల్లి అభయ ప్రదానం చేసింది.