DGP Rajendranath Reddy: ఆల్ ద బెస్ట్ అంటూ తన స్కూల్ నుంచి రాజేంద్రనాథ్ రెడ్డికి శుభాకాంక్షలు
AndhraPradesh DGPగా అదనపు బాధ్యతలు అందుకున్న Rajendranath Reddy కి... ఆయన చదువుకున్న స్కూల్ విద్యార్థులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. రాజేంద్రనాథ్ రెడ్డి... Anantapur జిల్లా పరిగి మండలం కొడిగెనహళ్లి గురుకుల పాఠశాలలో 8వ తరగతి నుంచి పది దాకా చదువుకున్నారు. 1981లో పదో తరగతి పాస్ అయ్యారు. తమ పాఠశాలలో చదువుకున్న విద్యార్థి ఇప్పుడు ఇంత ఉన్నతస్థాయికి రావడం సంతోషమని ప్రస్తుత ప్రిన్సిపల్ మురళీకృష్ణ ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థులు కూడా శుభాకాంక్షలు తెలిపారు.