Devudu Devudamma Village: ప్రతి ఇంట్లో ఓ దేవుడు, ఓ దేవుడమ్మ... ఇదే ఆ గ్రామస్తుల ఇబ్బంది
పల్లెటూళ్లలో చాలా రకాల సెంటిమెంట్లుంటాయి. తమ సంతానానికి చాలామంది తమ కుల దైవం పేరు పెట్టుకుంటారు. కానీ విజయనగరం జిల్లా గొల్లుపాలెంలో ఇప్పుడిదే పెద్ద సమస్యగా మారింది. ఒకరు ఇద్దరు కాదు... ఏకంగా 600 మందికి ఒకే పేరు ఉండడం వింతగా ఉండడమే కాదు... ఎన్నో సమస్యలకు కారణమవుతోంది. ఈ ఊళ్లో దాదాపు 500 కుటుంబాలుంటాయి. అయితే ప్రతి కుటుంబంలో పుట్టే మొదటి సంతానానికి సింహాద్రి అప్పన్నపై భక్తితో... అబ్బాయి అయితే దేవుడు అని.. అమ్మాయి అయితే దేవుడమ్మ అని పేరు పెడుతుంటారు. అందుకే... ఇప్పుడా గ్రామంలో దాదాపు 600 మంది దేవుడు, దేవుడమ్మలు ఉన్నారు. దీంతో బయటివారికి తమకు కావలసిన దేవుడు, దేవుడమ్మలను గుర్తించడం కష్టంగా మారింది.