Devarapalli Road Accident CCTV Visuals: ఘోర రోడ్డు ప్రమాదంలో 19 నెలల చిన్నారి మృతి, ఒళ్లు గగుర్పొడిచే సీసీటీవీ విజువల్స్
తూర్పుగోదావరి జిల్లాలోని దేవరపల్లి మండలం బందపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 19 నెలల చిన్నారి సహా ముగ్గురు మృతి చెందారు. విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్తున్న ఎర్టిగా కారు టైర్ పంక్చర్ అవటంతో వేగాన్ని అదుపు చేయలేక డివైడెర్ దాటి పక్క లేన్ లోకి వెళ్లి ఎదురుగా వస్తున్న మరో ఎర్టిగా కారును ఢీకొంది. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 19 నెలల చిన్నారి మరణించింది. మరో 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.