కుప్పం నియోజకవర్గం లో దళిత సంఘాలు ఆందోళన
కుప్పం నియోజకవర్గం రామకుప్పంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. స్థానిక శివాజీ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన అంబెడ్కర్ విగ్రహాన్ని అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు.దీంతో దళిత సంఘాలు ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు.తమకు న్యాయం చేయాలని, విగ్రహం ఉన్నచోట పెట్టకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు..ఈ క్రమంలో భారీగా చేరుకున్న పోలీసులు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన కూడా దళిత సంఘాలు వినలేదు..అర్ధరాత్రి సమయంలో అంబెడ్కర్ విగ్రహాన్ని ఎలా తొలగిస్తారని తక్షణం విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసారు.