ఎదుర్కొనేందుకు రంగంలోకి భారత నేవీ
జవాద్ తుపానును ఎదుర్కొనేందుకు భారత నేవీ సిద్ధమైంది. ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అవసరమైన సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు నౌకాదళం పేర్కొంది. జవాద్ తుపాను కదలికను నిశితంగా పరిశీలిస్తున్నట్లు నౌకాదళం పెర్కొంది. ఒడిశా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తూర్పు నావల్ కమాండ్ వెల్లడించింది. ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడుతున్నట్లు తెలిపింది. రాష్ట్రాలకు అవసరమైన సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది.