Cyclone Gulab: ఏపీలో భారీ వర్షాలు.. చెరువులను తలపిస్తున్న రహదారులు
Continues below advertisement
గులాబ్ తుఫాన్ కారణంగా ఆంధ్ర ప్రదేశ్‌లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖపట్నం, విజయనగరం, గుంటూరుతో పటు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. విశాఖపట్నం- విజయనగరం- శ్రీకాకుళం వైపు వచ్చే వాహనాలను కూడా నిలిపివేశారు. డొంకరోడ్డు, శ్రీనగర్, ఆరండల్ పేట, ఏటి అగ్రహారం చెరువులను తలపిస్తున్నాయి. విజయవాడ నుంచి విశాఖ వైపు వెళ్లే పది రైళ్లను దక్షిణ మధ్య రైల్వే శాఖ రద్దు చేసింది. తుపాను కారణంగా సుమారు 13,122 హెక్టార్లలో పంటలు, 291 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనా వేశారు.
Continues below advertisement