మా అబ్బాయి అప్పుడే క్రికెటర్ అవుతాడని ఫిక్స్ అయ్యా, నితీశ్ కుమార్‌ రెడ్డి తండ్రి

అనంతపురంలో దులీప్ ట్రోఫీ మ్యాచ్‌ల సందడి కొనసాగుతోంది. మొత్తం నాలుగు టీమ్స్‌ ఈ ట్రోఫీలో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లకు భారీ ఎత్తున అభిమానులు తరలివస్తున్నారు. భారత్‌, పాకిస్థాన్ మ్యాచ్‌కి వచ్చినంత జనం వస్తున్నారని క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి తండ్రి ముత్యాల రెడ్డి చెప్పారు. ABP దేశంతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన నితీశ్ కుమార్‌కి సంబంధించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. చిన్నప్పటి నుంచి నితీశ్‌కి క్రికెట్ అంటే పిచ్చి అని చెప్పారు. ఇంట్లో బాగా అల్లరి చేసే వాడని,ఆ బాధ పడలేక క్రికెట్ క్యాంప్‌కి పంపామని అన్నారు. ఇంట్లోనే బ్యాట్, బాల్‌తో ఆడుకునే వాడని చెప్పారు. ఇప్పుడు నితీశ్‌ని క్రికెటర్‌గా చూడడం చాలా గర్వంగా ఉందని అన్నారు ముత్యాల రెడ్డి. ఐపీఎల్‌ 2024 ఎస్‌ఆర్‌ హెచ్ తరపున ఆడాడు నితీశ్ కుమార్ రెడ్డి. మిడిల్‌ ఆర్డర్‌లో ఆడిన నితీశ్..142.92 స్ట్రైక్‌రేట్‌తో అదరగొట్టాడు. రానున్న రోజుల్లో టీం ఇండియాకు నితీష్ కుమార్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తారన్న ఆశాభావం తనకు ఉందని నితీష్ తండ్రి ముత్యాల రెడ్డి చెప్పారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola