CPI Ramakrishna: కడపజిల్లా కమలాపురం వరద ప్రభావిత ప్రాంతాల్లో సీపీఐ రామకృష్ణ పర్యటన
జవాద్ తుఫాను వల్ల రైతులకు అపార పంట నష్టం, ప్రజలు దాదాపు 69 మంది ప్రాణాలు కోల్పోయారని మృతి చెందిన కుటుంబాలకు 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. కడప జిల్లా కమలాపురం లో నష్టపోయిన పంట పొలాలను, కూలిపోయిన పాపాగ్ని వంతెన ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని వరద బీభత్సాన్ని జాతీయ విపత్తు గా ప్రకటించాలని, పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 20 వేల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలన్నారు. వైజాగ్ లో ఎల్జీ పాలిమర్స్ లో మృతి చెందిన వారికి కోటి రూపాయలు పరిహారం ఇచ్చిన సీఎం జగన్ సొంత జిల్లాలో 5 లక్షలు పరిహారం ఇవ్వడమేంటో అర్థం కావటం లేదన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని కోరారు. నెల్లూరు లో అమరావతి రైతుల పాదయాత్ర కు స్థానిక ఎమ్మెల్యే ఆటంకాలు కలిగించడం తగదన్నారు.