CPI Ramakrishna Arrested: పోరుగర్జనకు వెళ్తుంటే రామకృష్ణను అరెస్ట్ చేసిన పోలీసులు | ABP Desam

Anantapur లో నిన్న రాత్రి స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పెట్రోల్, డీజీల్, విద్యుత్ ధరల పెరుగుదలకు నిరసనగా సీపీఐ విజయవాడలో పోరుగర్జన కార్యక్రమం తలపెట్టింది. ఇందులో పాల్గొనేందుకు అనంతపురం నుంచి విజయవాడ వెళ్తున్న నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఇందులో పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా ఉన్నారు. పోలీసుల తీరుకు నిరసనగా అంబేడ్కర్ విగ్రహం వద్ద రోడ్డుపైనే నిద్రించారు. కాసేపటి తర్వాత పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. పోలీసుల తీరును టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తీవ్రంగా వ్యతిరేకించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola