Congress Tulasi Reddy: ఇళ్ల హక్కు పేరుతో ప్రజల నుంచి ఐదువేల కోట్లు లాగే ప్రయత్నం

Continues below advertisement

జగన్ ప్రభుత్వం సంపూర్ణ గృహ హక్కు పథకం పేరు మార్చి గృహ దోపిడి పథకం అని పెట్టుకుంటే సరిగ్గా సరిపోతుందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి పదునైన విమర్శలు చేశారు. వేంపల్లి తన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజల వద్ద నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు వసూలు చేయడమే లక్ష్యంగా సంపూర్ణ గృహ హక్కు పథకం సీఎం జగన్ ఏర్పాటు చేశారన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్రెడ్డి పేదలకు ఉచితంగా ఇల్లు ఇస్తే ఇప్పుడు జగన్ ముక్కుపిండి డబ్బులు వసూలు చేయాలని చూస్తున్నారన్నారు. జగన్ రాష్ట్రాన్ని అప్పుల ఉబిలోకి తీసుకెళ్లారని అందుకే పథకాల పేరిట ప్రజలను దోపిడీ చేసే పథకాలు ప్రవేశ పెడుతున్నారన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram