శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీ కోసం నూతన బూందీపోటు ప్రారంభం
Continues below advertisement
తిరుమల శ్రీవారిని ఏపీ సీఎం వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ మహా ద్వారం వద్ద టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. తెలుగు, తమిళంతో పాటు కన్నడ, హిందీ భాషల్లో కూడా యస్.వి.బి.సి ఛానళ్లను ప్రారంభించారు. శ్రీవారి భక్తులు ఆ భాషల్లో కూడా స్వామివారి సేవలను వీక్షించే అవకాశం కల్పించడమైనది. దేశవిదేశాల్లో ఉన్న హిందీ మరియు కన్నడ భక్తులు శ్రీవారి సేవల ప్రసారాలు వీక్షించాలని టిటిడి కోరింది.. అనంతరం శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీ కోసం శ్రీవారి ఆలయం దక్షిణం వైపున ఇండియా సిమెంట్స్ సంస్థ రూ.12 కోట్ల విరాళంతో నిర్మించిన నూతన బూందీపోటును సీఎం వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు.
Continues below advertisement