CM Jagan Hints on Andhra Pradesh Cabinet Reshuffling: సీఎం సూచనలు.. మంత్రుల సరదా ప్రశ్నలు| ABP Desam

AndhraPradesh లో Cabinet ను ప్రక్షాళన చేయాలని CM Jagan నిర్ణయించారు. ఈ విషయాన్ని Cabinet సమావేశంలోనే సహచరులకు సీఎం జగన్ చెప్పినట్లుగా తెలుస్తోంది. కొంతమందిMinisters... ఇదే తమకు చివరి కేబినెట్ సమావేశమా అని ముఖ్యమంత్రి జగన్‌నే సరదాగా ప్రశ్నించారు. దీంతో సీఎం జగన్ తన ఆలోచనలు కూడా అలాగే ఉన్నాయని వివరించినట్లుగా తెలుస్తోంది. చాలా మంది మంత్రి పదవుల ఆశావహులు ఉన్నారని... వారికి న్యాయం చేయాల్సి ఉందన్నారు. మంత్రివర్గంలో స్థానం లేనంత మాత్రాన డిమోషన్‌గా భావించవద్దని మంత్రులకు సూచించారు. కొంతమంది మంత్రులను జిల్లా పార్టీ అధ్యక్షులుగా నియమిస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న మంత్రులు పార్టీ కోసం పని చేయాలని..... పార్టీని గెలిపించుకుని వస్తే మళ్లీ మీరే మంత్రులు కావొచ్చని జగన్ వారితో వ్యాఖ్యానించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola