CM Jagan : ధర్మారెడ్డి, చెవిరెడ్డి కుటుంబాలకు సీఎం జగన్ పరామర్శ | ABP Desam
సీఎం జగన్ నంద్యాల, తిరుపతి జిల్లాల్లో పర్యటించారు. నంద్యాల జిల్లా పారుమంచాలలో పర్యటించిన జగన్...టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి నివాసానికి వెళ్లారు. ధర్మారెడ్డి కుమారుడి మృతిపై సంతాపం తెలిపిన జగన్...ధర్మారెడ్డి కుటుంబసభ్యులను ఓదార్చారు. ఆ తర్వాత అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంటకు చేరుకున్న సీఎం జగన్...అక్కడ నుంచి ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. చెవిరెడ్డి తండ్రి మృతికి సంతాపం తెలిపిన జగన్....చెవిరెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించారు.