వరద బాధితులకు చిన్నారుల సాయం, వీడియో పోస్ట్ చేసిన సీఎం చంద్రబాబు

Continues below advertisement

ఏపీ వరద బాధితుల కోసం సామాన్యులెంతో మంది సాయం అందించారు. సినీ ప్రముఖుల కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు. కష్టాల్లో ఉన్న వాళ్లని ఆదుకోడానికి ముందుకొచ్చి అంతా మానవత్వం చాటుకున్నారు. ఈ క్రమంలోనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో ఒక్కసారిగా భావోద్వేగానికి గురి చేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని పెంటపాడు మండలంలోని శ్రీవిద్యానికేతన్‌లో చదువుతున్న చిన్నారులు వరద బాధితుల కోసం సాయం చేశారు. తమ పాకెట్‌ మనీని విరాళంగా ఇచ్చారు. క్యూ కట్టి మరీ ఒక్కొక్కరూ తమ వంతు సాయం అందించారు. ఈ వీడియోని షేర్ చేసిన సీఎం చంద్రబాబు...ఆ చిన్నారులను ప్రశంసించారు. పిల్లల్లో ఇంత మంచి ఆలోచన వచ్చేలా ప్రోత్సహించినందుకు స్కూల్ యాజమాన్యంపైనా ప్రశంసలు కురిపించారు. పిల్లల్ని ఇలా బాధ్యతగల పౌరులుగా తీర్చి దిద్దడం చాలా గొప్ప విషయమని అన్నారు. సీఎంషేర్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram