
CM Chandrababu CM Revanth Met in Davos | దావోస్ లో కలిసిన చంద్రబాబు, రేవంత్ | ABP Desam
ఈ ఫోటో చూడండి. దావోస్ లో -5డిగ్రీల టెంపరేచర్ ఉంది ఇవాళ. అయినా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ కు వెళ్లారు. స్వాగతం సందర్భంగా కలుసుకున్న సీఎం చంద్రబాబు, సీఎం రేవంత్ రెడ్డి తమ ప్రతినిధి బృందాలతో కలిసి కాసేపు మాట్లాడుకున్నారు. ఏపీ ప్రతినిధుల బృందంలో మంత్రి నారా లోకేశ్ ఉంటే...తెలంగాణ బృందంలో సీఎం రేవంత్ తో పాటు మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు. కేంద్రమంత్రి హోదాలో రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. అక్కడ మూడు రోజుల పాటు జరగబోయే ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొని తెలుగు రాష్ట్రాలకు పెట్టుబడులు రాబట్టేలా ఇద్దరు ముఖ్యమంత్రులు వ్యూహరచనలు చేయనున్నారు. అయితే ఇప్పుడు టీడీపీ సోషల్ మీడియా ఓ పాత వీడియోను వైరల్ చేస్తోంది. అదేంటంటే
మీకు గుర్తుండే ఉంటుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సరిగ్గా ఏడాది క్రితం దావోస్ లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం నిర్వహించే ఆర్థిక సదస్సుకు ఎవ్వరూ హాజరుకాలేదు. అప్పుడు అది పెద్ద దుమారమే రేపింది. దావోస్ సదస్సుల్లాంటివి వాటికి వెళ్లకపోతే రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయి అని అప్పటి ఐటీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ ను ప్రశ్నిస్తే దావోస్ -5డిగ్రీల చలి ఉంటుందని..చాలా ఇబ్బందులు ఉంటాయని అప్పట్లో సమాధానం ఇవ్వటం పెద్ద దుమారమే రేపింది.