మూడు నెల‌లుగా పెండింగ్ లో ఉన్న జీతాలు ఇవ్వాలని డిమాండ్.

విజ‌య‌వాడ కొత్త ప్ర‌భుత్వాసుప‌త్రి వ‌ద్ద పారిశుధ్య కార్మికులు,సెక్యూరిటి సిబ్బంది ఆందోళ‌న‌కు దిగారు.మూడు నెల‌లుగా జీతాలు లేక అవ‌స్ద‌లు ప‌డుతున్నామ‌ని,క‌రోనా కాలంలో కూడ పారిశుధ్యం కాపాడేందుకు ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి ప‌ని చేస్తున్న త‌మ‌కు జీతాలు ఇవ్వ‌కుండా కాంట్రాక్ట్ సంస్ద నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా ఫ‌లితం లేక‌పోవ‌టంతో చివ‌ర‌కు గ‌త్యంత‌రం లేక స‌మ్మె చేయాల్సి వ‌స్తుంద‌ని అన్నారు,ప్ర‌భుత్వం వెంట‌నే త‌మ‌కు న్యాయం చేయాల‌ని కోరారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola