Chandrababu Naidu: కడప జిల్లాలో వరదల బీభత్సం ప్రభుత్వ ఘోరవైఫల్యం
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కడప జిల్లాలో పర్యటించారు. జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన.. బాధితులను పరామర్శించారు. రాజంపేట నందలూరు, చెయ్యేరు మండలాల్లో పరిస్థితులను సమీక్షించారు. ప్రాజెక్టుల నిర్వహణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్న చంద్రబాబు.. సీఎం గాలిలో తిరుగుతున్నారు తప్ప క్షేత్రస్థాయిలో పర్యటించలేదన్నారు. ప్రజలు వరదల్లో ఉంటే సీఎం విందు వినోదాల్లో పాల్గొంటున్నారని విమర్శించారు.