Chandrababu Naidu : చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటనలో ఆసక్తికర దృశ్యం
చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటనలో ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది. చంద్రగిరి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, తుడా ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి...ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు రాగానే నిలబడి నమస్కారం చేశారు. రాయలచెరువులో వరదబాధితులను పరామర్శించేందుకు చంద్రబాబు రాగా అప్పటికే అక్కడ చెవిరెడ్డి ఉన్నారు. చంద్రబాబు తిరుగు ప్రయాణం సమయంలోనూ అక్కడే ఉన్న చెవిరెడ్డి...చంద్రబాబు కాన్వాయ్ దగ్గరికి రాగానే లేచి నిలబడి నమస్కారం చేయటం ఆసక్తి నెలకొల్పింది.