Chandrababu Naidu on NDA Win | NDA శాసనసభా పక్ష సమావేశంలో చంద్రబాబు కామెంట్స్

 

దేశచరిత్రలో ఓ కూటమికి ఈ స్థాయిలో ప్రజాదరణ దక్కటం గొప్పవిషయమన్నారు చంద్రబాబు నాయుడు. విజయవాడలో నిర్వహించిన NDA శాసనసభ పక్ష ఎమ్మెల్యేల సమావేశంలో ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.

 

 

అధికారంలోకి వచ్చినా తాము సామాన్యులుగానే ఉంటామని.. రాష్ట్రంలో ఏ ఒక్కరి హక్కులకు భంగం వాటిల్లదని ఎన్డీయే కూటమి శానససభాపక్ష నేత చంద్రబాబు స్పష్టం చేశారు. టీడీపీ - జనసేన - బీజేపీ కూటమి శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన అనంతరం ఆయన మాట్లాడారు. పదవి హోదా కోసం కాదని.. ప్రజలకు సేవ చేసేందుకే అని అన్నారు. పదవి వచ్చిందని విర్రవీగొద్దని.. వినయంగా ఉండాలని.. విధ్వంస, కక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని పేర్కొన్నారు. అలాగే, తప్పు చేసిన వారిని వదిలిపెడితే అది పూర్తిగా అలవాటుగా మారుతుందని.. అలాంటి వారికి చట్టపరంగా శిక్ష పడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఎవ్వరూ ఇవ్వని తీర్పును ప్రజలు ఇచ్చారని.. వారి ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని స్పష్టం చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola